రైలు డ్రైవర్ అప్రమత్తlతో వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిన గూడ్స్ రైలు ప్రమాదం.
.
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి పెట్రోల్ తరలిస్తున్న గూడ్స్ రైలు స్టేషన్ నుంచి కొంత దూరం రాగానే ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఐఓసీ స్టాక్యార్డులోకి గూడ్స్ రైలు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాల పక్కకు ఒరిగిన బోగీని వేరు చేసి.. గూడ్స్ రైలును అక్కడి నుంచి పంపించారు. ఒక్కసారిగా బోగీలు పట్టాల నుంచి పక్కకి ఒరగడంతో అప్రమత్తమైన డ్రైవర్ రైల్‌ను వెంటనే నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అధికారుల ఆదేశాలతో రైల్వే సిబ్బంది పట్టాలకు మరమ్మతులు చేపట్టారు.