Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

Once upon a time, there was a great king called Vikramaditya - the WAM-4 - Shashank

Full Site Search
  Full Site Search  
Just PNR - Post PNRs, Predict PNRs, Stats, ...
 
Sat Jun 25 07:55:25 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Post PNRPost BlogAdvanced Search
Large Station Board;
Entry# 1493003-0
Medium; Platform Pic; Large Station Board;
Entry# 4243414-0
Medium; Platform Pic; Large Station Board;
Pedakurapadu station name board.
Entry# 4686590-0

PKPU/Peddakurapadu (2 PFs)
పెద్దకూరపాడు     पेदकूरपाडू

Track: Single Electric-Line

Show ALL Trains
Peddakurapadu, Palnadu Dist., Pin- 522402, Ph.no 08640-247534
State: Andhra Pradesh


Zone: SCR/South Central   Division: Guntur

No Recent News for PKPU/Peddakurapadu
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 6
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
0 Follows
Rating: NaN/5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 1 of 1 News Items  
Jul 24 2018 (10:02) Plan revised for Amaravathi, New Capital of AP. (www.eenadu.net)
Other News
SCR/South Central
0 Followers
76685 views

News Entry# 347282  Blog Entry# 3654733   
  Past Edits
Jul 24 2018 (10:02)
Station Tag: Narasaraopet/NRT added by Nazeer/1325255

Jul 24 2018 (10:02)
Station Tag: Sattenapalle/SAP added by Nazeer/1325255

Jul 24 2018 (10:02)
Station Tag: Peddakurapadu/PKPU added by Nazeer/1325255

Jul 24 2018 (10:02)
Station Tag: Namburu/NBR added by Nazeer/1325255

Jul 24 2018 (10:02)
Station Tag: Errupalem/YP added by Nazeer/1325255
రాజధానిపై రైల్వే దెబ్బ
అమరావతి రైలు ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష
ఎర్రుపాలెం-నంబూరు సింగిల్‌ లైన్‌కే పరిమితం
పెదకూరపాడు-అమరావతి, సత్తెనపల్లి-నరసరావుపేట మార్గాలు ప్రస్తుతానికి లేనట్లే
గత అంచనా వ్యయాన్ని తగ్గించిన రైల్వే బోర్డు
అసంతృప్తి
...
more...
వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - అమరావతి
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని రైలు మార్గాలతో అనుసంధానించే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో అత్యంత ప్రధానమైన ఎర్రుపాలెం-నంబూరు రైలు మార్గాన్ని సింగిల్‌ లైన్‌కే పరిమితం చేయాలని నిర్ణయించింది. పెదకూరపాడు-అమరావతి, సత్తెనపల్లి-నరసరావుపేట సింగిల్‌లైను రైలు మార్గాల నిర్మాణాన్ని ఆర్థికంగా వెసులుబాటు కాదంటూ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. తదునుగుణంగా గతంలో రూపొందించిన అంచనా వ్యయాన్ని రూ.2,679.59 కోట్ల నుంచి రూ.1,732.56 కోట్లకు తగ్గించింది. గత నెలలో జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ ఇటీవల విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రం సహయ నిరాకరణలో ఇది భాగమేనని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒక రాష్ట్ర రాజధానిని ప్రధాన రైలు మార్గాలతో అనుసంధానించేందుకు తలపెట్టిన లింక్‌ రైలు మార్గాల నిర్మాణాన్ని ఆర్థికంగా వెసులుబాటు కాదనే కోణంలో చూడటం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో రెండూ సింగిల్‌ లైన్లే. వాటి మొత్తం పొడవు 49.50 కి.మీ. నిర్మాణ వ్యయమూ తక్కువే. అయినా వాటినీ పక్కన పెట్టేశారు.
2016-17 బడ్జెట్‌లో ఆమోదం
అమరావతి నుంచి ప్రధాన రైలు మార్గాలను అనుసంధానించేందుకు గాను మూడు లింక్‌ మార్గాలను నిర్మించాలన్న డిమాండ్ల నేపథ్యంలో రైల్వే బోర్డు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) సంస్థతో రెండేళ్ల కిందట అధ్యయనం చేయించింది. దాని ప్రకారం విజయవాడ-మధిర మధ్యనున్న ఎర్రుపాలెం నుంచి దాములూరు, వడ్లమాను, తాడికొండ ప్రాంతాల మీదుగా అమరావతిని కలుపుతూ విజయవాడ-గుంటూరు మధ్యనున్న నంబూరు వరకూ (ఎర్రుపాలెం-నంబూరు) రైలుమార్గాన్ని 56.80 కి.మీ మేర డబుల్‌ లైన్‌, పెదకూరపాడు నుంచి అమరావతి వరకూ 24.50 కి.మీ మేర, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకూ 25 కి.మీ మేర సింగిల్‌ లైన్లు చొప్పున మొత్తం 106.03 కి.మీ మేర కొత్తగా లింకు మార్గాల అభివృద్ధికి రూ.2,679.59 కోట్లు వ్యయమవుతుందని అంచనాలు సిద్ధం చేయించింది. 2016-17 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉన్నా అది జరగలేదు. ఈ ప్రాజెక్టు వ్యయంలో సగం భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే బోర్డు కోరింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము ఆ భారాన్ని భరించలేమంటూ ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఎర్రుపాలెం-నంబూరు డబుల్‌లైన్‌ను సింగిల్‌ లైన్‌కు కుదిస్తూ సవరించిన అంచనాలు రూపొందించింది.
భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోరా?
అమరావతికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాకపోకలు సాగనున్నాయి. ఇప్పటి నుంచే దానికనుగుణంగా రైలు మార్గాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. అందుకు భిన్నంగా ప్రధాన అనుసంధాన మార్గాన్ని సింగిల్‌ లైన్‌కు పరిమితం చేయడం రాజధాని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలపైన ప్రభావం చూపుతుంది. అయితే తాజా మార్పుల విషయంపై దక్షిణమధ్య రైల్వే అధికారుల వివరణ కోసం అడిగేందుకు ప్రయత్నించగా..వారు స్పందించలేదు.
ప్రతిపాదిత రైలు మార్గాల నిర్మాణం చేపడితే ప్రయోజనాలివే!
* ఎర్రుపాలెం-నంబూరు మధ్య డబుల్‌ లైన్‌ నిర్మిస్తే రెండు వైపులా ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగేందుకు అవకాశముంటుంది. సింగిల్‌ లైన్‌ అయితే ఆ వెసులబాటు ఉండదు.
* పెదకూరపాడు-అమరావతి మార్గం నిర్మాణం ఫలితంగా సికింద్రాబాద్‌కు వెళ్లే దూరం తగ్గుతుంది.
* సత్తెనపల్లి-నరసరావుపేట మార్గాన్ని నిర్మిస్తే రాజధాని నుంచి గుంతకల్లు మీదుగా బెంగళూరు వెళ్లే ప్రధాన రైలు మార్గానికి అనుసంధానత ఏర్పడుతుంది.
Page#    Showing 1 to 1 of 1 News Items  

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy