రైల్వే టికెట్ క్యాన్సిలింగ్ కోసం ఆన్లైన్లో వివరాలన్నీ పొందుపరుస్తూ నానా తిప్పలు పడుతున్నారా ? టికెట్ క్యాన్సిలేషన్ కౌంటర్లో ఫామ్ పొందుపరస్తూ గంటల తరబడి క్యూలో నిల్చోవడం మీకు తలకు మించిన భారంగా మారిందా ? భారతీయ రైల్వే మీ గోడు ఆలకించింది. ఇక మీదట టికెట్ క్యాన్సిలేషన్ చాలా సులభం. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 గురించి మీకు తెలిసే ఉంటుంది. రైల్వేకు సంబంధించిన సమాచారమంతా ఆ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇకమీదట ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.
139కు కాల్ చేసి మీ వివరాలు చెబితే ఆ టికెట్ రద్దవుతుంది. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్‌కు టికెట్ రద్దు ప్రక్రియ పూర్తయినట్టు ధృవీకరిస్తూ ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది. దాన్ని సంబంధిత రైల్వే క్యాన్సిలేషన్ కౌంటర్లో చూపిస్తే...
more... మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తారు. ఈ సర్వీసును రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. టికెట్ క్యాన్సిలేషన్ చేసి డబ్బులు ఇచ్చే ముందు కొంత క్యాన్సిలేషన్ చార్జ్ చేయడం సహజం. ఈ కొత్త రూల్స్ ప్రకారం క్యాన్సిలేషన్ చార్జీలను రెట్టింపు చేస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అవసరమున్నవారు మాత్రమే రిజర్వేషన్ చేయించుకుంటారని సురేష్ ప్రభు తెలిపారు.